తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC), శ్రీ గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ కళాశాల, కందుకూరు సంయుక్త ఆధ్వర్యంలో నాంది ఫౌండేషన్ సహకారంతో కళాశాలలో విద్యార్థినుల కోసం ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థినులకు సెల్ఫ్ అవేర్‌నెస్, బాడీ లాంగ్వేజ్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఉద్యోగ అవకాశాలు, మనీ మేనేజ్‌మెంట్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మరియు గ్రూప్ డిస్కషన్ వంటి ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు ట్రైనింగ్ 3-8 -26 నుండి 8- 8-2026 వరకు జరిగింది.ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థినులు పెంపొందించుకోవాలని మెంటర్లు మిత్ర మనోహర్ మరియు చైతన్య గారు సూచించారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ మరియు సాఫ్ట్ స్కిల్స్, సమర్థవంతమైన కమ్యూనికేషన్, ఆత్మవిశ్వాసం, సమయపాలన మరియు ఆర్థిక నిర్వహణ వంటి అంశాలు వ్యక్తిగత, వృత్తిపరమైన అభివృద్ధికి ఎంతో కీలకమని వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్కిల్ ఆఫీసర్ శ్రీ జె. రవి తేజ గారు పాల్గొని విద్యార్థినులకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు మరియు కెరీర్‌కు సంబంధించిన అంశాలపై మార్గదర్శనం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మెంటర్లు విద్యార్థినులకు ప్రాక్టికల్ శిక్షణ అందిస్తూ, ఇంటర్వ్యూలు మరియు గ్రూప్ డిస్కషన్లను సమర్థవంతంగా ఎదుర్కొనే విధానాలను వివరించారు.ఈ సందర్భంగా శ్రీ గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ కళాశాల, కందుకూరు చైర్మన్ CH. రామకృష్ణారావు , డైరెక్టర్ CH. భారద్వాజ్ మరియు ప్రిన్సిపాల్ పి. గీతా శ్రీనివాస రావు మాట్లాడుతూ, విద్యార్థినులకు విద్యతో పాటు ఉద్యోగ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం మరియు ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.విద్యార్థినులు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, నిపుణులు మరియు మెంటర్ల నుంచి పలు అంశాలపై అవగాహన పొందారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన మరిన్ని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని కళాశాల యాజమాన్యం పేర్కొంది.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, మెంటర్లు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.