తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
మెగా డీఎస్సీ–2025 ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవకతవకలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కందుకూరు సబ్-కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ దీక్షలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు పాల్గొని డీఎస్సీ అభ్యర్థులకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్సీ నియామ్మకాల్లో జరిగిన అన్యాయం, అక్రమాల మీద సీబీఐ విచారణ చేపట్టాలని అన్నారు.జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో డిఎస్సీ లో జరిగిన అవినీతి పైన చర్చకు రావాలని సవాలు చేశారు.యువత భవిష్యత్తుతో ముడిపడిన ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, నిష్పక్షపాతంగా వ్యవహరించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువత, డీఎస్సీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు.డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తూమాటి మాధవరావు స్పష్టం చేశారు.