తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :-
టీడీపీ కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఇటీవల మరణించిన కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మణికే ఉదయ్ కుమార్, మర్రిపూడి మండలం కెల్లంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గోగుల ప్రవీణ్ కుమార్, చిలముకూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త డాలు చిన్న నరసయ్య, టంగుటూరు మండలం ఆలకూరపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త దివి కోటయ్యల కుటుంబ సభ్యులకు టీడీపీ కార్యకర్తల సంక్షేమ భీమా ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున చెక్కుల్ని మంగళవారం తూర్పునాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి డా.స్వామి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… టీడీపీ కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివి. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలే. టీడీపీ కార్యకర్తల కష్టాల్లో యువనేత నారా లోకేష్ అండగా నిలుస్తున్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనివిధంగా కార్యకర్తల సంక్షేమ నిధి తీసుకొచ్చారు. కార్యకర్తలకు ఎప్పుడు ఎక్కడ ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ అండగా నిలుస్తున్నారని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల ప్రమాద బీమా చెక్కులు అందుకున్న కార్యకర్తల కుటుంబ సభ్యులు టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.