తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :-
ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో ఇటీవల మృతి చెందిన కొండపి నియోజకవర్గానికి చెందిన నలుగురు టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున కార్యకర్తల సంక్షేమ బీమా చెక్కులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పార్టీ కోసం కార్యకర్తలు చేసిన త్యాగాలు, వారు ఎదుర్కొన్న కష్టాలు ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. కార్యకర్తలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేలా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత శ్రీ నారా లోకేష్ నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.