వికసిత భారత్ మన అందరి సామాజిక బాధ్యత గా ప్రతి ఒక్కరు భావించి అభివృద్ధికి కలిసి పనిచేయాలని సింగరాయకొండ సిఐ వై శ్రీహరి పిలుపు ఇచ్చారు.
ఎనభై వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సింగరాయకొండ పోలీస్ సర్కిల్ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పిలుపు తో గ్రామ స్థాయి నుండి ప్రతి ఒక్కరూ దేశ సమైక్యతను కోసం కలిసి పని చేయాలని కోరారు. ప్రజలు వివేకంతో ఆలోచన చెయ్యాలని సామాజిక భద్రత, అభివృద్ధి సంక్షేమం శాంతి భద్రతల పరిరక్షణ కోసం కలిసి ముందుకు నడవాలని ఆయన కోరారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సమైక్య భారత్ శ్రేష్ఠ భారత్ స్వర్ణాంధ్ర సాధన లో ప్రతి పౌరుడు, యువకుడు విద్యార్థి తమ వంతు బాధ్యత తీసుకోవాలని శ్రీహరి కోరారు. సింగరాయకొండ పోలీస్ సర్కిల్ పరిధిలోని సింగరాయకొండ, జరుగుమల్లి, టంగుటూరు పోలీస్ స్టేషన్ లు నేర రహిత పోలీస్ స్టేషన్ లుగా తీర్చి దిద్దేందుకు ప్రజలు పోలీస్ కి సహకరించాలని సి ఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 15 న ప్రతి ఒక్కరూ స్వతంత్ర దినోత్సవాన్ని పండుగ గా జరుపుకోవాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *