సంతోషం వ్యక్తం చేసిన వృద్ధులు, దివ్యాంగులు
చల్లగా ఉండాలని MLA ను ఆశీర్వదించిన అవ్వాతాతలు
తొలి శుభోదయం ఉలవపాడు:-
ఎన్నికలకు ముందు చెప్పినట్లుగా, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సంపూర్తి విశ్వాసంతో ఉన్నారని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. కేవలం పింఛన్ల కోసం ప్రతి ఏటా బడ్జెట్లో సుమారు 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు. ఉలవపాడు మండలం ఉలవపాడు గ్రామంలోని మసీదు ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పింఛన్లను ఎమ్మెల్యే నాగేశ్వరరావు సోమవారం పంపిణీ చేశారు. స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, వారి యోగక్షేమాలు విచారిస్తూ, పింఛను నగదును అందజేశారు. ప్రతినెల 1వ తేదీన పింఛన్ నగదు అందటానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చలవేనని, కుటుంబ పెద్దబిడ్డ లాగా తమ బాగోగులు చూసుకుంటున్నారని పలువురు వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు. పండుటాకుల కడుపు నింపుతున్న ఈ కూటమి ప్రభుత్వం, మంచి పనులు చేస్తున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చల్లగా ఉండాలని నిండు మనసుతో ఆశీర్వదించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే నాగేశ్వరావు గారు మాట్లాడుతూ ప్రతి నెల మొదటి రోజే 95 శాతం పింఛన్లను లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాల అమలు విషయంలో చంద్రబాబు నాయుడు ఎక్కడా రాజీ పడటం లేదని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో ఏడాదికి 250 చొప్పున మాత్రమే పింఛన్ పెంచారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వృద్ధులకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచారని గుర్తు చేశారు. అలాగే దివ్యాంగులకు 6 వేలు, శాశ్వత వైకల్యం ఉన్నవారికి 15 వేలు పింఛన్ ఇస్తున్నామన్నారు. ఇంకా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి సంక్షేమ కార్యక్రమాల అమలుపట్ల మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్యే చెప్పారు. ప్రధానంగా ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు పట్టలేని ఆనందంతో ఉన్నారని చెప్పారు.
కూటమి ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు నిధుల కొరత లేదని, అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. జగన్ ప్రభుత్వంలో పంచాయతీలకు వచ్చే నిధులను క్షణాల్లో మాయం చేసేవారని, పల్లెల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఎమ్మెల్యే గారు విమర్శించారు. కానీ ఇప్పుడు 15 ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు సక్రమంగా విడుదల చేస్తున్నామని చెప్పారు. ఉలవపాడు లోని మసీదు ప్రాంతంలో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యేగారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేష్ బాబు, ఎమ్మార్వో శ్రీనివాసరావు, ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షుడు రాచగర్ల సుబ్బారావు ఉలవపాడు గ్రామ పార్టీ అధ్యక్షుడు చిరుతోటి గిరిబాబు, పార్టీ నాయకులు ఎండి అబ్దుల్ కరీం, ఎస్కే బాబు, మండల మైనార్టీ అధ్యక్షుడు పటాన్ రాహుల్, ఎస్ఎం భాషా బ్రదర్స్, అబ్దుల్ ఖాదర్, ఎస్ కే రహంతుల్లా. ఎస్ కే ఏజస్, సాత్యిక్ షాజహాన్, ఎంపీటీసీ దార్ల యలమందమ్మ తొట్టెంపూడి మాల్యాద్రి, బాపనపల్లి పవన్ కుమార్, బడిదల సాంబయ్య, కొండప నాయుడు, బత్తుల రమేష్, దార్ల కోటేశ్వరరావు, చింతల సింగయ్య, ఓగుబోయిన మాల్యాద్రి, ఓగుబోయిన యానాది, అమ్మనబ్రోలు రమేష్, అమ్మనబ్రోలు మాధవ, కోటేశ్వరరావు, గోపాల్ రెడ్డి, దాసరి వెంకటరావు, దాసరి వెంకటేష్, రావినూతల కనకారావు. రాయపాటి నాగేశ్వరరావు, టి తిరుపతి మరియు అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల సభ్యులు కూటమి నేతలు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..
