హత్య ఘటనపై ఆరా… కేసును త్వరితగతిన ఛేదించాలని సిబ్బంది కి అదేశించిన ఎస్పీ గారు*
ఘటన స్థలాన్ని ఇప్పటికే పరిశీలించిన క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్
హత్య కేసును చేధించేందుకు ఏడు ప్రత్యేక పోలీసు టీంలను ఏర్పాటు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా, సియస్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్శి గుంట పేట గ్రామనికి చెందిన పావలి వెంకటసుబ్బమ్మ, (62 సం) అనే 13-08-2026, సుమారు మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి వారి శరీరంపై ఉన్న బంగారు నగలను తీసుకొనివెళ్ళారు. శుక్రవారం హత్య జరిగిన నేర స్థలమునకు జిల్లా ఎస్పీ గారు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించితోపాటు చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న ప్రజలతో మాట్లాడినారు. ఈ హత్య ఎలా జరిగింది, తదితర వివరాలపై ఆరా తీశారు. మరోసారి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లచే ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయించారు. ఘటనా స్థలంలోని ఉన్న అన్ని ఆధారాలను జాగ్రత్తగా సేకరించి భద్రపరచాలన్నారు. పాత నేరస్తుల జాబితాను పరిశీలించి ఈ తరహా నేరాలకు పాల్పడే వారిపై లిస్ట్ తయారు చేసి పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఘటన జరిగిన సమయంలో జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించాలన్నారు. ఈ కేసుల్లో గుర్తుంచుకోవలసిన విషయాలు, దర్యాప్తు అవసరమైన పలు సలహాలు,సూచనలు అధికారులకు ఎస్పీ గారు తెలియచేసినారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ హత్య జరిగిన వెంటనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపామని, ఏడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని, ఈ కేసును వీలైనంత త్వరగా చేయించడమే పోలీస్ లక్ష్యమని తెలియజేశారు. హత్య జరగక ముందు జరిగిన తర్వాత సమయంలో స్థానికులు ఎవరినైనా అనుమానస్పదంగా గుర్తించినా లేదా ఏదైనా క్లూ వున్నా వెంటనే పోలీస్ అధికారులకు తెలియజేయాలని కోరారు.ఈ విషయాలు ఎవరికైన తెలిస్తే సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ఎస్పీ గారు తెలిపారు.జిల్లా ఎస్పీ గారి వెంట మార్కాపురం ఓఎస్డీ (అడ్మిన్)నవజ్యోతి మిశ్రా ఐపీఎస్ గారు,కనిగిరి డిఎస్పీ ఇంచార్జి పి.శ్రీధర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు,కనిగిరి సీఐ శ్రీనివాసులు,కందుకూరు సీఐ అన్వర్ బాషా, పొదిలి సిఐ రాజేష్ కుమార్, CCS సీఐ కమలాకర్ రావు, పామూరు సిఐ వినోద్ కుమార్, ఎస్సైలు మరియు క్లూస్ టీం అధికారులు మరియు సిబ్బంది ఉన్నారు.