తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ లోని గీతం స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోబో చేసిన స్వాగతం మరియు స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్,స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది.విద్యార్థులు దేశభక్తుల వేషధారణలో ప్రత్యేక అలంకరణగా నిలిచారు . ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ లక్ష్మణ్ జాతీయ జెండాని ఎగరవేసిన అనంతరం దేశానికి స్వతంత్రానికి కృషి చేసిన మహనీయుల గురించి కొనియాడారు , తదుపరి విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తి గీతాలతో అలరించారు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తాజుద్దీన్, ధనలక్ష్మి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.