భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగార్జున పబ్లిక్ స్కూల్, కందుకూరులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశభక్తి, జాతీయ స్ఫూర్తి మరియు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం విద్యార్థులు దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి సందేశాలను అందించారు.వేడుకల్లో భాగంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు, ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించి ఆకట్టుకున్నారు. చిన్నారుల నుంచి ఉన్నత పాఠశాల విద్యార్థుల వరకు ఉత్సాహంగా పాల్గొని భారతదేశ గొప్పతనాన్ని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను తమ ప్రదర్శనల ద్వారా చాటిచెప్పారు.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శ్రీమతి వి. షాలిని రెడ్డి గారు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం అనేది కేవలం వేడుక చేసుకునే రోజు మాత్రమే కాదని, దేశం పట్ల బాధ్యతను గుర్తుచేసే మహత్తరమైన రోజని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు, దేశభక్తి మరియు బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని అలవర్చుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో విద్యార్థులు విద్యలోనూ, జీవితంలోనూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని అన్నారు. ఆధునిక విద్యతో పాటు దేశభక్తి, విలువలు, సామాజిక బాధ్యతలను విద్యార్థుల్లో పెంపొందించడమే పాఠశాల లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డి. శివ కుమార్ యాజమాన్యం వి. మర్రెడ్డి, కె. శ్రీనివాసరావు, ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థుల అద్భుతమైన ప్రదర్శనలు, దేశభక్తి కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *