తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
80 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ సేవకు గాను సింగరాయకొండ సాంత్వనా సేవా సమితి డైరెక్టర్ రావినూతల జయ కుమార్ కు ఈ అవార్డు లభించింది.
తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజలకు మేలుకరమైన పనులు చేస్తూ, ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పిస్తూ.. మాద కద్రవ్యాలు, హెచ్ఐవి /ఎయిడ్స్ పై అవగాహన మరియు బాల్యవివాహాలు, బాల కార్మికుల నిర్మూలన,బాండెడ్ చైల్డ్ లేబర్స్, వెట్టి చాకిరి నుండి విముక్తి కల్పించుట, మానవ అక్రమ రవాణా, ఇలాంటి కార్యక్రమాలు విస్తృతంగా చేస్తూ నందుకు, ఆయన ఈ అవార్డు లభించింది
ఒంగోలు పోలీస్ గ్రౌండ్స్ లో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డా. శ్రీ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి,, ప్రకాశం జిల్లా గౌరవ కలెక్టర్ శ్రీ.పి. రాజబాబు ఐ.ఏ.ఎస్, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి IAS ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన రాజు IPS గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు.
పలు స్వచ్ఛంద సంస్థల హర్షం : జయ కుమార్ కి ఈ అవార్డు రావడం పట్ల ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లాలోని పలు స్వచ్ఛంద సంస్థలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ జయ కుమార్ మాట్లాడుతూ.. తన సేవను గుర్తించి ఈ అవార్డు ఇచ్చినటువంటి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.