వలేటివారి పాలెం మండలం మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఈఓ, డిప్యూటీ కమిషనర్ పి. శ్రీనివాసులు రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని ఈఓ పి. శ్రీనివాసులు రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, వేదపండితులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పిస్తూ భక్తిశ్రద్ధలతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *