80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎస్ వి కె పి కళాశాల ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత ఐఏఎస్ గారు హాజరై పోలీస్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు మరియు రాజకీయ ప్రముఖులు హాజరై జిల్లా పోలీస్ సిబ్బందికి, వేడుకలకు విచ్చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, పోలీసులకు, మీడియా ప్రతినిధులకు,ఆడపడుచులకు యావన్మందికి 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.పెరేడ్ కమాండర్ ఆర్ఐ రమణారెడ్డి ముఖ్య అతిథికి గౌరవ వందనం సమర్పించి, కవాతు పరిశీలన కొరకు ఆహ్వానించగా, పరేడ్ పరిశీలన వాహనం ఎక్కి పరేడ్ ప్లటూన్లను పరిశీలించి తిరిగి సభా వేదిక చేరుకొన్నారు. అనంతరం తన ప్రసంగంలో స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాల గురించి గుర్తు చేసుకున్నారు. జిల్లా ప్రగతిని, అభివృద్ధి పనులు మరియు ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను కలెక్టర్ గారు వివరించారు.అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు అభివృద్ధిని తెలుపుతూ ప్రత్యేకంగా తయారు చేసిన శకటాల ప్రదర్శనను తిలకించారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను, దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ విద్యార్థులు, కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విధుల్లో పోలీసుశాఖ అధికారులకు, సిబ్బందికి పోలీసు సేవా పతకాలు మరియు ప్రశంసా పత్రాలను మంత్రి వర్యులు ప్రదానం చేశారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి మంత్రి గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు గారు, ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి గారు, ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి గారు, ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా ఐపీయస్ గారు, మార్కాపురం డిఎస్పి యు నాగరాజు, డీఎఫ్ఓ అబ్దుల్ రవూఫ్ గారు, మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు వెంకట శివరామి రెడ్డి, అజయ్ కుమార్ గార్లు, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *