80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రకాశం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు గౌరవ రాష్ట్ర సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధులు సంక్షేమం & స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు శాఖా మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఈ వేడుకులకు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు IAS గారు, జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు, ప్రకాశం జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు మరియు రాజకీయ ప్రముఖులు హాజరై జిల్లా పోలీస్ సిబ్బందికి, వేడుకలకు విచ్చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, పోలీసులకు, మీడియా ప్రతినిధులకు,ఆడపడుచులకు యావన్మందికి 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.పెరేడ్ కమాండర్ ఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు ముఖ్య అతిథికి గౌరవ వందనం సమర్పించి, కవాతు పరిశీలన కొరకు ఆహ్వానించగా, పరేడ్ పరిశీలన వాహనం ఎక్కి పరేడ్ ప్లటూన్లను పరిశీలించి తిరిగి సభా వేదిక చేరుకొన్నారు. అనంతరం తన ప్రసంగంలో స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాల గురించి గుర్తు చేసుకున్నారు. జిల్లా ప్రగతిని, అభివృద్ధి పనులు మరియు ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను మంత్రి గారు వివరించారు. పోలీస్ శాఖ:ప్రీవెన్టివ్ పోలీసింగ్, శాస్త్రీయ దర్యాప్తు, ప్రజల భాగస్వామ్యంతో గత రెండు సంవత్సరాల్లో నేరాలను 26 శాతం, మహిళలపై నేరాలను 23 శాతం తగ్గించాం. మాదకద్రవ్యాల నిర్మూలనలో 73 కేసులు నమోదు చేసి 322 మందిని అరెస్టు చేశాము. 554.38 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాము. గత 6 నెలలో SC/ST లపై వివక్షకు సంబంధించిన నేరాలు 34% తగ్గినవి. మహిళల భద్రతకు శక్తి యాప్ ప్రచారం, స్వీయరక్షణ శిక్షణలు నిర్వహించాము. రోడ్డు భద్రతలో E4 విధానాన్ని అమలు చేసి, రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 5 శాతం తగ్గించాం. CCTV-360, డ్రోన్ పోలీసింగ్ ద్వారా 7 వేల 413 సీసీటీవీ కెమెరాలు, 31 డ్రోన్లతో నేరాల నివారణను బలోపేతం చేశాము. డయల్ 100/112 ద్వారా గత రెండు సంవత్సరాల్లో 912 కేసులు నమోదు చేసి, 120 మందిని రక్షించామన్నారు.స్వాతంత్ర్య సమరయోధుల వారి కుటుంబ సభ్యులను మంత్రి గారు మరియు జిల్లా అధికారులు ఘనంగా సన్మానించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక చక్కటి డెమో నిర్వహించారు. అనుకోకుండా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసు శాఖకు గానీ, అత్యవసర వైద్య సేవల కోసం గానీ ఫోన్ చేస్తే, సమాచారం అందుకున్న సంబంధిత శాఖకు చెందిన సిబ్బంది మాత్రమే ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుంటారు. ఇలా ఒక్క శాఖ మాత్రమే స్పందించడం వల్ల ప్రమాద బాధితులకు సకాలంలో అవసరమైన సహాయం అందక, కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రకాశం జిల్లా పోలీసులు వినూత్న ఆలోచనతో, జిల్లా కలెక్టర్ గారి పరిశీలనలో 4E కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ 4E అంటే..1.ఎమర్జెన్సీ,2.ఎడ్యుకేటెడ్ (అవగాహన),3. ఇంజనీరింగ్, 4. ఎన్ఫోర్స్మెంట్.రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరైనా 112 పోలీసులకు లేదా 108 అత్యవసర సేవలకు ఫోన్ చేసిన వెంటనే, సంబంధిత అన్ని శాఖలకు తక్షణమే సమాచారం చేరుతుంది. 112కు సమాచారం అందిన వెంటనే రోడ్డు సేఫ్టీ టీమ్ వాట్సాప్ గ్రూప్‌లో సమాచారాన్ని షేర్ చేస్తారు. దీని ద్వారా నిమిషాల వ్యవధిలో ప్రమాదం జరిగిన ప్రదేశానికి సంబంధిత శాఖల సిబ్బంది చేరుకుని బాధితులకు తక్షణ సహాయం అందిస్తారు.అంతేకాకుండా, ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఏవైనా ఇంజనీరింగ్ లోపాలు ఉన్నట్లయితే, వాటిని గుర్తించి తక్షణమే సరిదిద్దే చర్యలు చేపడతారు. అవసరమైతే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడంతో పాటు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాల్సి వస్తే వాటిని కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటారు.అదేవిధంగా, ప్రమాదంలో గాయపడిన బాధితులకు సమీపంలోని ఆసుపత్రి యాజమాన్యంతో పోలీసు అధికారులు సమన్వయం చేసుకుని, బాధితులు ఆసుపత్రికి చేరుకున్న వెంటనే తక్షణ వైద్యం అందేలా చర్యలు చేపడతారు. ఇలా 4E కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించడంతో పాటు, భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాల నివారణకు కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు అభివృద్ధిని తెలుపుతూ ప్రత్యేకంగా తయారు చేసిన శకటాల ప్రదర్శనను తిలకించారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను, దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ విద్యార్థులు, కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విధుల్లో పోలీసుశాఖ అధికారులకు, సిబ్బందికి పోలీసు సేవా పతకాలు మరియు ప్రశంసా పత్రాలను మంత్రి వర్యులు ప్రదానం చేశారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి మంత్రి గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎం.పి.శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన్ రావు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవిన్యూ అధికారులు, అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) యన్.యుగంధర్ బాబు, అడిషనల్ ఎస్పీ (క్రైమ్) సిహెచ్ వెంకటేశ్వర్లు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఏఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు, ప్రముఖులు, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *