తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
తాళ్లూరులో నూతనంగా ఏర్పాటు చేసిన 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారితో కలిసి ప్రారంభించారు.ఈ నూతన సబ్‌స్టేషన్ ద్వారా తాళ్లూరు మండలంతో పాటు పరిసర ప్రాంతాలకు మరింత మెరుగైన, నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుంది.ఈ కార్యక్రమంలో డా. కడియాల లలిత్ సాగర్ గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ నారపుశెట్టి పాపారావు గారు, దర్శి ఏఎంసీ చైర్మన్ శ్రీమతి దారం నాగవేణి–సుబ్బారావు గారు, దర్శి మున్సిపల్ చైర్మన్ శ్రీ నారపుశెట్టి పిచ్చయ్య గారు, తాళ్లూరు మండల ఎంపీపీ శ్రీ తాటికొండ శ్రీనివాసరావు గారు, మండల టీడీపీ అధ్యక్షులు శ్రీ మేడగం వెంకటేశ్వరరెడ్డి గారు, విద్యుత్ శాఖ అధికారులు, టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.భక్తి – అభివృద్ధి సమన్వయంతో… తాళ్లూరు, దర్శి ప్రగతికి మరో శక్తివంతమైన అడుగు!