ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 35 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు సోమవారం మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం (PGRS)” ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని మార్కాపురం అడిషనల్ ఎస్పీ, OSD (అడ్మిన్) శ్రీ నవజ్యోతి మిశ్రా, ఐపీఎస్., గారు మరియు పోలీస్ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారులతో పోలీస్ అధికారులు ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను విని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగ సంబంధిత / ఆన్‌లైన్ మోసాలు, భూ వివాదాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ఫిర్యాదిదారులు స్వేచ్ఛగా విన్నవించారు. ఫిర్యాదిదారుల సమస్యలను సవివరంగా విని, సానుకూలంగా స్పందించిన అధికారులు చట్టపరమైన విధానాల ద్వారా త్వరితగతిన న్యాయం అందిస్తామని భరోసా కల్పించారు.అందిన ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో అధికారులు మాట్లాడి, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే విచారణ చేపట్టి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. “మీకోసం” కార్యక్రమం ద్వారా అందిన ఫిర్యాదులపై ఎలాంటి అలసత్వం, జాప్యానికి తావులేకుండా నిర్ణీత గడువులోపు విచారణ పూర్తి చేసి పరిష్కారం అందించాలని స్పష్టం చేశారు.జిల్లా పోలీసు కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరుకాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీసు స్టేషన్‌లు, సర్కిల్ కార్యాలయాలు లేదా సబ్-డివిజన్ కార్యాలయాల ద్వారా కూడా అందజేయవచ్చు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదాలు, చీటింగ్, కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పి యు.నాగరాజు, పామూరు సిఐ వినోద్ కుమార్, గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.