ప్రజా ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి సోమవారం జిల్లా ఎస్పీ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు మరియు పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (మీకోసం)ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యలతో వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను జిల్లా ఎస్పీ గారు స్వీకరించారు. పిర్యాదుదారులతో ఎస్పీ గారు ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.జిల్లా ఎస్పీ గారు ఆయా ఫిర్యాదులపై సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో వెంటనే ఫోన్ లో మాట్లాడి మీ కోసం కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి చట్టప్రకారం విచారణ జరిపి పిర్యాదుదారులకు త్వరితగతిన న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే వృద్ధులు, నడవలేని పరిస్థితిలో ఉన్నవారి సమస్యలను ప్రత్యేకంగా పరిశీలనలోకి తీసుకొని, సంఘటన స్థలాలను సందర్శించి చట్టప్రకారం సత్వర న్యాయం అందించాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ గారు సూచించారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాల్లో కూడా అందజేయవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, అత్తరింటి వేదింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ హాజరత్తయ్య, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జున రావు, గుడ్లూరు సీఐ రమేష్, ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై యాస్మిన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *