కందుకూరు పట్టణంలో నుడా ఆధ్వర్యంలో జరుగుతున్న MIG లేఅవుట్ అభివృద్ధి పనులను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. విశాలంగా నిర్మిస్తున్న రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మున్సిపల్ కమిషనర్ కే. అనూష, డిఈ గణపతి, ఇతర అధికారులు, పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. 290 ప్లాట్లుగా విభజించిన లేఅవుట్ లో… మౌలిక వసతుల కోసం మొదటి విడతగా 9 కోట్ల రూపాయలు మంజూరు కాగా, పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు, ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులు చేయిస్తున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల్లో రాజీ పడకుండా, నాణ్యతగా ఉండేలా చూడాలని ఎమ్మెల్యే గారు అధికారులను ఆదేశించారు. సిసి రోడ్లు, డ్రైనేజీ పనులు ముగిసిన వెంటనే లేఅవుట్ చుట్టూ ప్రహరీ నిర్మాణాన్ని కూడా ప్రారంభించాలని సూచించారు. గత ప్రభుత్వంలో లేఅవుట్ ను నిర్లక్ష్యంగా వదిలేశారని, కూటమి ప్రభుత్వంలో లేఅవుట్ కు తిరిగి ప్రాణం పోశామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలియజేశారు. సదరు స్థలాన్ని 22A నుంచి తప్పించి, మోడల్ లేఅవుట్ గా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎమ్మెల్యే గారి వెంట పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, రూరల్ అధ్యక్షుడు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు, రూరల్ మాజీ అధ్యక్షుడు నార్నే రోశయ్య, కాంట్రాక్టర్ చల్లా నాగేశ్వరరావు, స్థానిక నాయకులు గడ్డం మాలకొండయ్య, పువ్వాడి కోటయ్య, భవనాసి వెంకటేశ్వర్లు, పొడపాటి మాధవ, కూనం నరేంద్ర, ముచ్చు వేణు, యర్రా ముసలయ్య, పులి నాగరాజు, పలువురు నాయకులు ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *