తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
కందుకూరులోని గుర్రం వారి పాలెం లో ఉన్నటువంటి శ్రీ సంస్కృతి స్కూల్లో ఓనం పండుగను విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని మరియు తరగతి గదులను పూల ముగ్గులు మరియు తోరణాలతో అలంకరించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కేరళ సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ పండగను నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశాన్ని చైర్మన్ గారైన కొంకా చంద్రశేఖర్ గారు వివరించారు. దేశాభివృద్ధి అంటే వివిధ రంగాలలో పురోగతి చెందడమే కాదు మన సంస్కృతిని మనం కాపాడుకోవడంలో కూడా ఉంటుందని , మన సంస్కృతిని భావితరాల వారికి అందించాలనే ముఖ్య ఉద్దేశంతో శ్రీ సంస్కృతి స్కూల్లో ప్రతి పండగను మతం, రాష్ట్రము, కులంతో సంబంధం లేకుండా అత్యంత ఉత్సాహంగా ఘనంగా నిర్వహించి ఆ పండగల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని విద్యార్థులందరికీ తెలియజేయడమే అన్నారు. ఓనం అనేది కేరళలో నిర్వహించే అతి ముఖ్యమైన పండగ అని, ఈ పండుగ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెబుతాయి అన్నారు. విద్యార్థులకు ఇతర రాష్ట్రాల సంస్కృతులపై అవగాహన కల్పించేందుకు ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకలలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఓనం పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి డ్రామాలు మరియు నృత్యాలు చేశారు.ఈ కార్యక్రమం చైర్మన్ కొంకా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి ప్రిన్సిపల్ హరి, వైస్ ప్రిన్సిపల్ శోభారాణి , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు హాజరై విజయవంతం చేశారు.