తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మిస్సింగ్ మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్రేస్ చేసి, వాటి యజమానులకు సురక్షితంగా అప్పగించారు.కందుకూరు టౌన్ పీఎస్: మిస్సింగ్ అయిన 3 మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి సంబంధిత యజమానులకు అప్పగించారు.
త్రిపురాంతకం పీఎస్: మిస్సింగ్ అయిన 2 మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి సంబంధిత వ్యక్తులకు అందజేశారు. పీసీ పల్లి పీఎస్: మిస్సింగ్ మొబైల్ ఫోన్‌ను ట్రేస్ చేసి యజమానికి అప్పగించారు. దోర్నాల పీఎస్: మిస్సింగ్ మొబైల్ ఫోన్‌ను ట్రేస్ చేసి రికవరీ చేసి సంబంధిత యజమానికి అందజేశారు.ప్రజల ఫిర్యాదులపై స్పందిస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి మిస్సింగ్ మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేయడంలో పోలీసులు ప్రత్యేక చొరవ చూపారు.ప్రజల ఆస్తి, భద్రత పరిరక్షణలో పోలీసుల సేవలు నిరంతరం కొనసాగుతాయి.