తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:-
నెల్లూరు కలెక్టరేట్లో గురువారం ఎస్సీ కమిషన్ తరఫున ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్. జవహర్ గారిని కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఛైర్మన్ గారి వెంట ఎస్సీ కమిషన్ సభ్యులు శ్రీపతి బాబు గారు, రామాంజమ్మ గారు ఉన్నారు.