తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
గౌరవ కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి అధ్యక్షతన ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించబడింది.ఈ సమావేశంలో గౌరవ గోపాలపురం శాసనసభ్యులు మరియు జోనల్ కోఆర్డినేటర్ శ్రీ మద్దిపాటి వెంకటరాజు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఏపీ టూరిజం చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ శ్రీమతి పొదపాటి తేజస్విని, ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు శ్రీ కొటారి నాగేశ్వరరావుపాల్గొన్నారు.అలాగే, ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల మండల పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పార్లమెంట్ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు మరియు ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ బలోపేతం, రాబోయే కార్యక్రమాల నిర్వహణ, ప్రజలతో మరింత మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన విధానాలపై విస్తృతంగా చర్చించారు.