తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
గీతం ఒలంపియాడ్ పాఠశాలలో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కులమతాలకు అతీతంగా సమాజంలో సోదర భావాన్ని, ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ వేడుకల్లో పాఠశాల బాల,బాలికలందరూ
ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు.ఈ సందర్భంగా లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతూ.. రాఖీ అనేది కేవలం ఒక దారం పోగు కాదని, అది సమాజంలో మహిళల రక్షణకు, వారికి ఇచ్చే గౌరవానికి పురుషులు ఇచ్చే పవిత్రమైన భరోసా అని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే విద్యార్థులలో ఇలాంటి సాంస్కృతిక విలువలను పెంపొందించడం అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, అక్కా,తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక అయిన ఈ రక్షాబంధన్ పండుగ అందరి జీవితాలలో ఆనందాలు, ఆరోగ్యం, సిరిసంపదలను నింపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ లక్ష్మణ్ ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.