చుక్క నీరు లేకుండానే ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసి జగన్ ప్రజలను మోసం చేశారు
మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం : –
మార్కాపురానికి కృష్ణాజలాలు రావడం జగన్ అండ్ కోకి ఇష్టం లేదని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం మార్కాపురంలో వెలిగొండ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఆనం రామనారాయణ రెడ్డి , నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, పొంగూరు నారాయణ, మార్కాపురం జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు . అనంతరం మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధిపై వైసీపీకి చిత్తశుద్ధి లేదు, మార్కాపురానికి కృష్ణాజలాలు రావడం YCPకి ఇష్టం లేదు. ఈ ప్రాంతాన్ని ఓటు బ్యాంక్‌గా చూడటం దారుణం. వెలుగొండ ప్రారంభోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా చేశాం, వెలిగొండ పూర్తి చేశాం. 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబే..నేడు ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు. చుక్క నీరు లేకుండా ప్రాజెక్టు జాతికి అంకితం చేసి ప్రజలను మోసం చేసిన ఘనత వైసీపీదే. జగన్ ఫేక్ వ్యక్తి, వైసీపీ ఫేక్ పార్టీ. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం. వెలిగొండ జలాలకు ప్రజలు హారతులతో స్వాగతం పలకాలి, చారిత్రాత్మక ఘట్టంలో ప్రజలంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కోరారు.