తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఒంగోలు వన్‌టౌన్ సీఐ గారు ఆర్టీసీ బస్టాండ్‌ను సందర్శించి భద్రతా పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా బస్టాండ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను గుర్తించి వారి వివరాలను పరిశీలించారు.ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్టాండ్‌లోని రద్దీ ప్రాంతాలు, ప్రయాణికుల కదలికలు, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.