గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు , దోర్నాల మండలం, గంటావానిపాలెం వద్ద వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్ద గుంటూరు రేంజ్ ఐ.జీ శ్రీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, ఐ.పి.ఎస్. మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., బందోబస్తు ఏర్పాటులను పరిశీలించారు. దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద ముఖ్యమంత్రి , జలహారతి, పైలాన్ ఆవిష్కరించి, గేట్లు ద్వారా నీటిని విడుదల చేసి, ప్రజావేదికలో ముఖ్యమంత్రి ,, పాల్గొని, అనంతరం విజయవంతంగా పర్యటనను ముగించి బయలుదేరారు. పర్యటనకు ముందు, హెలిప్యాడ్, వి.ఐ.పి. రూట్, హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ ప్రాంతం నుండి జల హారతి జరిగే ప్రదేశం,పైలన్, గేట్లు,ప్రజావేదిక ప్రదేశం మరియు పార్కింగ్ ప్రాంతాలను గుంటూరు రేంజ్ ఐ.జీ ,, మరియు జిల్లా ఎస్పీ ,, సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ,, మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి ,, పర్యటనను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. బందోబస్తు విజయవంతంగా పూర్తి చేసినందుకు జలహారతి,ప్రజా వేదిక, రూట్ మరియు ట్రాఫిక్, బందోబస్తు అధికారులు మరియు సిబ్బందిని ఎస్పీ ,, అభినందించారు. పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకుని విధులను నిర్వర్తిస్తే, ఏ కార్యక్రమం అయిన విజయవంతంగా నిర్వహించగలమని పేర్కొన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో గౌరవ ముఖ్యమంత్రి,, పర్యటన విజయవంతమైందని తెలిపారు. పర్యటనను విజయవంతంగా నిర్వహించిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఎస్పీ , అభినందనలు తెలియజేసి, అలాగే సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు మరియు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు….

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *