ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా సింగరాయకొండ మండలంలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో సింగరాయకొండ వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అలాగే మూలగుంటపాడు పంచాయతీ పరిధిలోని ఐటీఐ కళాశాల సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాలాభిషేకం చేసి, పూలమాల వేసి నివాళులర్పించారు.ఆదిమూలపు సురేష్ ఆదేశాల మేరకు, వైఎస్సార్సీపీ సింగరాయకొండ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు నాయకత్వంలో కందుకూరు రోడ్ సెంటర్‌తో పాటు సుందర్‌నగర్, కనుమళ్ల, బాలయోగినగర్ ప్రాంతాల్లోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ను జనహృదయ నేతగా, పేదల పెన్నిధిగా, రైతు బాంధవుడిగా, జలయజ్ఞానికి శ్రీకారం చుట్టిన నాయకుడిగా పార్టీ నేతలు స్మరించుకున్నారు.ఈ కార్యక్రమాల్లో సింగరాయకొండ గ్రామ అధ్యక్షుడు షైక్ కరీం, ఎంపీటీసీ అంబటి ప్రసాద్, షైక్ సుల్తాన్, భాస్కరరెడ్డి, ప్రకాష్ రెడ్డి, గ్యాస్ రంగా రెడ్డి, శ్రీనివాసులు, బెల్లం రామిరెడ్డి, జయరామి రెడ్డి, రాయి పేరాజు, కరీం, అల్లాబక్షు, బషీర్ అహ్మద్, ఎస్టీ సెల్ శ్రీనివాసులు, రాంబాబు, సుభాని, యనమల మాధవి, రామకృష్ణ, వెంకన్న, అభిద్, జావీద్, ఇంతియాజ్, అబ్దుల్ ఖాదర్, నౌషద్, సురేష్, శంకర్, షైక్ మౌలాలి, వినోద్, వెంకరెడ్డి, సుబ్బారెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.వీరితో పాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి వివిధ విభాగాల అధ్యక్షులు, సెక్రటరీలు, గ్రామ అధ్యక్షులు, విలేజ్ సెక్రటరీలు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్‌కు నివాళులర్పించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *