తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ సీఐ కె. కమలాకర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ సి.హెచ్. చెంచయ్య, ఏఎస్‌ఐ షేక్ మహబూబ్ భాష మరియు సిబ్బంది జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించారు.ఈ క్రమంలో 01/02.09.2026 రాత్రి 00:30 గంటలకు కందుకూరు పట్టణంలోని సూర్య బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి వద్ద నుంచి 88 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని, వ్యక్తిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కందుకూరు టౌన్ పోలీసులకు అప్పగించారు.జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఏదైనా సమాచారం ఉంటే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112 పోలీస్ వాట్సాప్ నెంబర్ 9121102266 కు సమాచారం అందించాలన్నారు.