తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :-
వేసుకునుటకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారు రూపొందించిన రిస్క్ అసెస్మెంట్ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఆ స్కాన్ ద్వారా వచ్చిన ప్రశ్నలకు సమాధానం పొందుపరిచినట్లయితే మీకు హెచ్ఐవి పరీక్ష అవసరమో లేదో తెలుసుకునే అవకాశం ఉందని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బివి సాగర్ పేర్కొన్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియాత్రన సంస్థ ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ప్రకాశం జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ సమీకృత వ్యూహం దిశ, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అద్దంకి పట్నంలోని ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీ, విశ్వ భారతి, రాయల్, హర్షిని జూనియర్ కాలేజీల్లో ఇంటెన్సిఫైడ్ ఐ. ఈ సి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది బి. వి సాగర్ మాట్లాడుతూ హెచ్ఐవి ని తొలి దశలోని గుర్తించినట్లయితే త్వరగా చికిత్స ప్రారంభించి ఆరోగ్యకరమైన పూర్తి జీవితాన్ని గడపవచ్చని హెచ్ఐవి స్థితి తెలుసుకోవటం ముఖ్యం చికిత్స పొందటం మరింత ముఖ్యమని అన్ని ప్రభుత్వాలు ఆరోగ్య కేంద్రాల్లో హెచ్ఐవి పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్షత చూపించకూడదని వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచాలని హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల యొక్క వివరాలు బహిర్గతం చేసినట్లయితే హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ చట్టం 2017 ప్రకారం చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని యువత మాదకద్రవ్యాలకు బానిసలు కాకూడదని అసురక్షిత సెక్స్ కార్యకలాపాలలో పాల్గొనకూడదని, ప్రతి ఒక్కరికి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై తగు సూచనలు సలహాలు కొరకు 1097 అవగాహన కలిగించాలని సుఖ వ్యాధులైన ఎస్టీ ఐ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు తదనంతరం విద్యార్థి విద్యార్థుల చే మరియు కళాశాల సిబ్బందిచే రిస్కే అసెస్మెంట్ క్యూఆర్ స్కాన్ చేపించడం జరిగినది ఈ కార్యక్రమంలో హెల్ప్ స్వచ్ఛంద సంస్థ అద్దంకి ఔట్రిచ్ వర్కర్లు టి.దుర్గా భవాని, వి. మల్లేశ్వరి కళాశాల ప్రిన్సిపలలు ఎమ్ వి రాత్తయ్య, ఎమ్ శివరామి రెడ్డి పి నర్సింహారవు , టి శ్రీనివాసరావు, ఎమ్. రాఘవ ఎమ్ శ్రీనివాస్ రావు విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు….