ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌డీపీఓ, ఒంగోలు గారి నేతృత్వంలో పోలీసులు విస్తృతంగా ఫుట్ పెట్రోలింగ్‌ నిర్వహించారు. బొల్లినేనివారిపాలెం, కమ్మపాలెం, గోపాల్‌నగర్‌ 2 లేన్‌ తదితర ప్రాంతాల్లో పోలీసులు కాలినడకన పర్యటిస్తూ శాంతిభద్రతల పరిస్థితులను పరిశీలించారు.ఈ సందర్భంగా రౌడీషీటర్ల ఇళ్లను సందర్శించి వారి ప్రస్తుత పరిస్థితులు, కదలికలపై ఆరా తీశారు.కౌన్సెలింగ్‌ నిర్వహించి, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా చట్టాన్ని గౌరవిస్తూ ప్రశాంత జీవనం సాగించాలని సూచించారు.ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు నేరాలను ముందస్తుగా నియంత్రించేందుకు విజిబుల్‌ పోలీసింగ్‌, ఫుట్ పెట్రోలింగ్‌, రౌడీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.నేర నియంత్రణే లక్ష్యం – ప్రజల భద్రతే ప్రకాశం జిల్లా పోలీసుల ప్రథమ కర్తవ్యం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *