ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో విధులు నిర్వహిస్తూ వివిధ కారణాలతో మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలు, రిటైర్డ్ పోలీసు సిబ్బంది, హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్. యుగంధర్ బాబు గారితో పాటు ఎఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు గురువారం పోలీస్ కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందాల్సిన సంక్షేమ, రిటైర్మెంట్ ప్రయోజనాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు, పెండింగ్‌లో ఉన్న సమస్యలపై వివరాలు సేకరించారు. పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత డీపీఓ అధికారులకు అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు గారు ఆదేశించారు. కారుణ్య నియామకాలు పొందని కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి, వారికి త్వరితగతిన కారుణ్య నియామకాలు పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఎన్. యుగంధర్ బాబు గారు మాట్లాడుతూ, పోలీసు శాఖలో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సర్వీసులో లేకపోయినా ప్రతి ఒక్కరూ పోలీసు కుటుంబంలో భాగమేనని, వారి సంక్షేమానికి జిల్లా పోలీసులు ఎల్లవేళలా వారికి బాసటగా ఉంటారని భరోసా ఇచ్చారు. సుదీర్ఘకాలం ప్రజాసేవకు అంకితమై విధులు నిర్వర్తించి రిటైర్మెంట్ పొందిన పోలీసు సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను కలుసుకోవడం ఆనందంగా ఉందని, వారు అందించిన సేవలను పోలీసు శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం తరుపున రావలసిన ప్రయోజనాలు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని, పోలీస్ కుటుంబ సభ్యులకు ఏ సమస్య వచ్చిన తనను నేరుగా కలవచ్చునని తెలియచేసినారు. ఈ కార్యక్రమంలో RI సీతారామిరెడ్డి, AAO P. E. విజయ కుమార్, డీపీఓ సూపరింటెండెంట్ లు యాస్మిన్ భాను,వినుత మరియు డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *