తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
భాష్యం విద్యాసంస్థల అధినేత, గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ శుక్రవారం కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు రామకృష్ణ గారికి సాదర స్వాగతం పలకడంతో పాటు శాలువాతో ఘనంగా సత్కరించారు. పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, ఇతర నాయకులను ఎంపీ గారికి నాగేశ్వరరావు పరిచయం చేశారు. వందల కోట్ల రూపాయలతో కందుకూరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా రామకృష్ణ గారికి వివరించారు.