సింగరాయకొండ, ప్రకాశం జిల్లా ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.
సింగరాయకొండ మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ (బాలికలు), సింగరాయకొండ పాఠశాలలోని సాధారణ వినియోగ ప్రదేశాలకు ట్యూబ్‌లైట్లు, ఎల్‌ఈడీ లైట్లు మరియు అవసరమైన ఫిట్టింగ్స్ ఏర్పాటుకు షేక్ కరీముల్లా గారు ₹50,000/- విరాళంగా అందించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా విద్యార్థులకు సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన అభ్యసన వాతావరణాన్ని అందించేందుకు ఈ సహకారం దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున షేక్ కరీముల్లా(డిల్లు)గారి సేవాభావాన్ని అభినందిస్తూ Certificate of Appreciation అందజేయడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలలకు అండగా నిలుస్తున్న దాతల సహకారం మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
“ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి – సమాజం ఉమ్మడి బాధ్యత” అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని విద్యాశాఖ అధికారులు కోరారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *