రీజనల్ కోఆర్డినేటర్ చేతుల మీదగా ఐడి కార్డ్ అందుకున్న బుర్రా.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ మరియు పార్టీ క్యాడర్ కు ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న కందుకూరు నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ ఇంచార్జ్ బుర్రా మధుసూధన్ యాదవ్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గంలో మున్సిపాలిటీ, జెడ్పిటిసి,ఎంపీటీసీ,పంచాయితీలలో పోటీ చేయడం జరుగుతుందని మంచి ఫలితాలు సాధించుటకు ప్రయత్నిస్తామని తెలిపారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ కార్యకర్తలకు అత్యధికప్రాధాన్యత కల్పిస్తూ స్థానిక సంస్థల్లో పోటీకి అవకాశం కల్పిస్తామని అన్నారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పార్లమెంటు సభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేతుల మీదుగా నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ కు ఐడి కార్డును అందచేయడం జరిగినది.