తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గ :-
వీపీఆర్ స్కూల్‌లో పదో తరగతిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన అంబటి వైష్ణవి ఉన్నత చదువులకు ఫౌండేషన్ తరఫున అందిస్తున్న సహాయాన్ని కొనసాగిస్తున్నాం.ప్రస్తుతం కోవూరులోని గీతాంజలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న వైష్ణవి మూడో ఏడాది ఫీజు కోసం రూ.1 లక్ష చెక్కును ఆమె తండ్రి ఎరుకులరెడ్డిగారికి అందజేశాను.వైష్ణవి ఇంటర్మీడియట్ నుంచి ఇప్పటివరకు ఆమె విద్యకు ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. ప్రతిభకు పేదరికం అడ్డంకి కాకూడదన్నదే మా సంకల్పం. చదువులో రాణించే ప్రతిభావంతులైన విద్యార్థులకు భవిష్యత్తులోనూ వీపీఆర్ ఫౌండేషన్ పూర్తి సహకారం అందిస్తుంది.వైష్ణవి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.