తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:-
చాకిచెర్ల పెద్ద పట్టపు పాలెం లోని జెట్ పి హెచ్ యస్ ప్రభుత్వం పాఠశాల నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు ప్రకాశం జిల్లా దిశ వారి ఆదేశాల మేరకు లింక్ వర్కర్ స్కీమ్ వారి ఆధ్వర్యం లో స్కూల్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాలు గౌరవనీయులు జేమ్స్ స్యాముల్ గారి సహకారం తో లింక్ వర్కర్ స్కీమ్ వారి ఆధ్వర్యం లో హెచ్ ఐ వి, ఎయిడ్స్ మరియు టి బి, సుఖ వ్యాధులు, సిఫిలిస్, హెపటైటిస్,– బి వ్యాధులు పట్ల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఈ సందర్భంగా హెచ్ యం సార్ గారు మాట్లాడుచు ప్రతి ఒక్కరూ ఈ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలియజేసినారు , స్కూల్ సెక్రటరీ సుదర్శి భాస్కర్ రావు మాట్లాడుచు, యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదని, వ్యాధుల పట్ల అవగాహన పెంచుకొని, ఈలాంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని తెలియజేసినారు స్థానిక లింక్ వర్కర్ వీరమల్లు రవీంద్ర మాట్లాడుచు హెచ్ ఐ వి వైరస్ ఒకరి నుండి మరొకరికి నాలుగు మార్గాలు ద్వారా వ్యాప్తి చెందుతుందని హెచ్ ఐ వి అంటూ వ్యాధి కాదు అని అంటినుకొను వ్యాధి అని, హెచ్ ఐ వి జీవిస్తున్నారు వారికి ప్రభుత్వం వారు ఏ ర్ టి మందులు ప్రతి నెలా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందనీ ప్రతి ఒక్కరూ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం వలన వారి యొక్క ఆరోగ్య స్థితినీ తెలుసుకొనవలెను అని ప్రతి గర్భిణీ స్త్రీలు హెచ్ ఐ వి , సిఫిలిస్, హెపటైటిస్ బి పరీక్షలు చేయించు కొనవలెను అని తొలి దశ లోనే వ్యాధులను గుర్తిస్తే, అవి ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, తెలిపారు ఈ కార్యక్రమంలో హెచ్ యం సార్, స్కూల్ సెక్రటరీ శ్రీ సుదర్శి భాస్కర్ రావు, సైన్స్ ఉపాధ్యాయులు శరత్ బాబు పి డి సార్ ఏ యన్ యం, ఏ , అనిత ఆశ వర్కర్స్ , భవాని, మాధవి మరియు,ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు