రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్
తొలి శుభోదయం న్యూస్ అద్దంకి :-
ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చలసాని ఆంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పాకాల త్రినాథ్, కార్యదర్శి శ్రీ వలివర్తి దుర్గాప్రసాద్ రాజు, ప్రభుత్వ సంబంధాల సమన్వయ కార్యదర్శి శ్రీ గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గార్లతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్తు శాఖ మంత్రి గారిని కలిసి, గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్తు అందించాలని వినతిపత్రం సమర్పించి కోరగా… కోరిన గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని గౌరవ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు తెలియజేశారు.
రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలు చక్కగా జరగాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రభుత్వం ద్వారా “సింగిల్ విండో నమోదు పద్ధతి, ఉచిత విద్యుత్తు” తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వారు తెలియజేశారు.
గణేష్ మండపాల వద్ద ఉత్సవాల కోసం గణేష్ కాషాయ ధ్వజాలు, పర్యావరణ ప్రాధాన్యతను తెలియజేసే బ్యానర్లను గణేష్ ఉత్సవ సమితి ప్రతి గణేష్ మండపానికి ఉచితంగా ఇవ్వడానికి తయారుచేసిన వాటిని శ్రీ మంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం గణేష్ మండపాలకు “ఉచిత విద్యుత్తు, సింగిల్ విండో నమోదు పద్ధతి” ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి ధన్యవాదాలు తెలియజేసింది.