కందుకూరులోని గుర్రం వారి పాలెం లో ఉన్న శ్రీ సంస్కృతి స్కూల్లో గణేశ్ చతుర్థి వేడుకలను పురస్కరించుకుని ముందస్తు వేడుకలను శుక్రవారం(11-09-2026) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ కొంకా చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ,పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పాఠశాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించామని,
విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా మైదా పిండి, గోధుమ పిండి, మట్టి, ఆకులు తదితర సహజ పదార్థాలతో పర్యావరణహిత గణేశ్ విగ్రహాలను స్వయంగా తయారు చేశారని ,అనంతరం విద్యార్థులు ఆ విగ్రహాలను పాఠశాల పరిసర ప్రాంతాల్లోని ఇళ్లకు అందజేస్తూ, పర్యావరణహిత గణేశ్ విగ్రహాల ప్రాముఖ్యతను, వాటి ద్వారా పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించారని చెప్పారు. చిన్న గణేశ్ విగ్రహాలను సైతం ఇళ్లకు అందజేసి పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించారు.మధ్యాహ్నం పాఠశాల ఆవరణలో నిర్వహించిన గణేశ్ చతుర్థి ప్రీ-సెలబ్రేషన్స్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గణేశ్ చతుర్థి విశిష్టతను తెలియజేస్తూ నాటకాలు, నృత్యాలు, స్కిట్లు, ప్రసంగాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. విద్యార్థుల ప్రతిభ, ఉత్సాహం మరియు చక్కటి ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అదేవిధంగా పాఠశాలలో గణేశుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. అనంతరం సంప్రదాయబద్ధంగా గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా శ్రీ సంస్కృతి స్కూల్లో గణేశ్ చతుర్థి వేడుకలను సంప్రదాయం, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన పాఠశాల చైర్మన్ కొంకా చంద్రశేఖర్, ప్రిన్సిపల్ హరి, వైస్ ప్రిన్సిపల్ శ్రీ సంస్కృతి స్కూల్లో ఘనంగా ముందస్తు గణేశ్ చతుర్థి వేడుకలు శ్రీ సంస్కృతి స్కూల్లో గణేశ్ చతుర్థి వేడుకలను పురస్కరించుకుని ముందస్తు వేడుకలను శుక్రవారం(11-09-2026) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ కొంకా చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ,పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పాఠశాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించామని,
విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా మైదా పిండి, గోధుమ పిండి, మట్టి, ఆకులు తదితర సహజ పదార్థాలతో పర్యావరణహిత గణేశ్ విగ్రహాలను స్వయంగా తయారు చేశారని ,అనంతరం విద్యార్థులు ఆ విగ్రహాలను పాఠశాల పరిసర ప్రాంతాల్లోని ఇళ్లకు అందజేస్తూ, పర్యావరణహిత గణేశ్ విగ్రహాల ప్రాముఖ్యతను, వాటి ద్వారా పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించారని చెప్పారు. చిన్న గణేశ్ విగ్రహాలను సైతం ఇళ్లకు అందజేసి పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించారు.మధ్యాహ్నం పాఠశాల ఆవరణలో నిర్వహించిన గణేశ్ చతుర్థి ప్రీ-సెలబ్రేషన్స్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గణేశ్ చతుర్థి విశిష్టతను తెలియజేస్తూ నాటకాలు, నృత్యాలు, స్కిట్లు, ప్రసంగాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. విద్యార్థుల ప్రతిభ, ఉత్సాహం మరియు చక్కటి ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అదేవిధంగా పాఠశాలలో గణేశుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. అనంతరం సంప్రదాయబద్ధంగా గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా శ్రీ సంస్కృతి స్కూల్లో గణేశ్ చతుర్థి వేడుకలను సంప్రదాయం, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన పాఠశాల చైర్మన్ కొంకా చంద్రశేఖర్ గారు, ప్రిన్సిపల్ హరి, వైస్ ప్రిన్సిపల్ శోభారాణి,ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *