తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
మూలగుంటపాడులో ని శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగే చెకుముకి టాలెంట్ టెస్ట్ కి ఎంపికయ్యారు. మండల స్థాయిలో ప్రధములుగా నిలిచిన టెన్త్ క్లాస్ విభాగంలో షేక్ గౌసియా సుహనా, నైన్త్ క్లాస్ విభాగంలో కె సాత్విక, 8th క్లాస్ విభాగంలో కె రిత్విక భరద్వాజ్ లు జిల్లా స్థాయిలో జరిగే చెకుముకి టాలెంట్ టెస్ట్ కి ఎంపికయ్యారని నిర్వాహకులు కోటపాటి నారాయణ, విజయానంద్ లు తెలియజేశారు. విద్యానికేతన్ హైస్కూలు కరస్పాండెంట్ సైకం వెంకటేశ్వరావు మాట్లాడుతూ చెకుముకి టాలెంట్ టెస్ట్ లో తమ విద్యార్థులు విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తపరుస్తూ,వారికి అభినందనలు తెలియజేశారు.