తొలి శుభోదయం సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ, గవదగట్ల వారి పాలెం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు పాఠశాలకు మౌలిక వసతులు కల్పనలో భాగంగా పాఠశాల గ్రంథాలయం ఏర్పాటు కొరకు సవిడి బోయిన మురళి పుస్తకాలు పెట్టుకొనుటకు అవసరమైన బీరువా, విద్యార్థులు కూర్చునుటకు అవసరమైన కుర్చీలను షేక్ కరిముల్లా(ఢిల్లు) సమకూర్చారు. ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యావ్యవస్థలో నూతన పోకడలకు నాంది పలుకుతూ రాష్ట్రవ్యాప్తంగా మెగా పి.టి.ఎమ్,మాక్ అసెంబ్లీ వంటి పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారని ఆయన ఆలోచనలకు అనుగుణంగా పాఠశాలలో మినీ గ్రంథాలయం ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించిన ప్రధానోపాధ్యాయులుఅర్రిబోయిన రాంబాబును మరియు సహకరించిన దాతలను అభినందించారు.
అనంతరం రాష్ట్ర సంఘీక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని పాఠశాల ఆవరణలో మామిడి మొక్కలు నాటి విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ వేల్పుల వాణి, ఉపాధ్యాయులు అంబటి బ్రహ్మయ్య,అజయ్ కుమార్ చౌదరి, న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు, గవదగట్ల రమణయ్య, షేక్ నాసిర్,మించల బ్రహ్మేశ్వర రావు, బాపట్ల ప్రభాకర్, గోపిరెడ్డి, సుబ్బారెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు రజిని శ్రీదేవి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *