మండలంలోని అన్ని పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి పాఠశాల నిర్వహణ కమిటీ (SMC)లను పునర్‌వ్యవస్థీకరించేందుకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి అబ్దుల్ సత్తార్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నోటీసు బోర్డులో ఎన్నికల ప్రకటన పత్రాలను ఉపాధ్యాయులు సంపంగి.సుబ్రహ్మణ్యం, సిఆర్పీ మురళీమోహన్ ప్రదర్శించారు. సెప్టెంబర్ 15న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా, సెప్టెంబర్ 18న ఓటర్ల జాబితాను పాఠశాలల నోటీసు బోర్డులపై ప్రదర్శించి, సెప్టెంబర్ 25న ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి, తుది జాబితాను ప్రకటిస్తామన్నారు.సెప్టెంబర్ 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌ఎంసీ సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తామని, మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నిక, 2 గంటలకు ప్రమాణ స్వీకారం, 3 తొలి ఎస్‌ఎంసీ సమావేశం నిర్వహించనున్నట్లు ఎంఈవో అబ్దుల్ సత్తార్ చెప్పారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *