సెప్టెంబర్ 16న యువనేత, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్య, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు కోవూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.కోవూరు నియోజకవర్గానికి విచ్చేస్తున్న యువనేతకు మన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలకాలి.అనంతరం ర్యాలీగా బయలుదేరి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం టీడీపీ కేడర్ సమావేశానికి హాజరవుతారు.కోవూరులోకి స్వాగతం పలికే చోటు నుంచి తిరిగి వీడ్కోలు పలికే వరకు యువనేతకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టడం మన బాధ్యత. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇది.ముఖ్యంగా కేడర్ సమావేశానికి ప్రతి ఒక్క కార్యకర్త తప్పక హాజరై, టీడీపీ సభ్యత్వ కార్డును వెంట తీసుకురావాలి.యువనేత వెంట అడుగులో అడుగు వేద్దాం… కోవూరు పర్యటనను విజయవంతం చేద్దాం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *