తొలి శుభోదయం న్యూస్ బాపట్ల : –
బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రావుల కార్తిక్ గారికి 2026 –27 విద్యా సంవత్సరానికి గాను “బెస్ట్ ప్రొఫెసర్” అవార్డు లభించింది.
కళాశాలలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సభలో కళాశాల ప్రిన్సిపాల్ చేతుల మీదుగా కార్తీక్ అవార్డును అందుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, బోధనా రంగంలో చూపుతున్న ప్రతిభ, అంకితభావం, సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కళాశాల వర్గాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కాలేజ్ MD కళాశాల కరస్పెండెంట్ పాల్గొని రావుల కార్తీక్‌ను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు..!!