ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా లాడ్జిలు, డార్మిటరీస్‌పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో లాడ్జిలు, డార్మిటరీస్‌లో బస చేస్తున్న వ్యక్తుల వివరాలు, గుర్తింపు పత్రాలు, రిజిస్టర్‌ల నిర్వహణ, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గుర్తించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించేలా నిర్వాహకులకు సూచనలు చేశారు.అసాంఘిక కార్యకలాపాలకు లాడ్జిలు, డార్మిటరీస్‌ వేదికలుగా మారకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అతిథి వివరాలను తప్పనిసరిగా నమోదు చేసి పోలీసుల సూచనలు పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు.ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని నేరాల నివారణ, అనుమానాస్పద కదలికల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం.. నేరాల నియంత్రణకు నిరంతర నిఘానే మా లక్ష్యం!

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *