తొలి శుభోదయం న్యూస్ తిరుపతి:-
తిరుపతి నందు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు శ్రీ అనగాని సత్య ప్రసాద్ గారి అధ్యక్షతన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 9 మెన్ కమిటీ తో ( కూటమి ) జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్, జోనల్ కో-ఆర్డినేటర్ & అన్నమయ్య జిల్లా టీడీపీ ఎన్నికల ఇంచార్జి శ్రీ దామచర్ల సత్య రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ, క్షేత్రం స్థాయి సమన్వయం, తదితర అంశాలపై కూటమి నాయకులతో కలిసి విస్తృతంగా చర్చించడం జరిగింది.ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి గారు, తిరుపతి జిల్లా టీడీపీ ఎన్నికల ఇంచార్జి నూకసాని బాలాజీ గారు మరియు టీడీపీ-జనసేన-బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొనడం జరిగింది.