గిద్దలూరు పట్టణంలో గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాచర్ల గేట్ వద్ద ప్రారంభమైన ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం విద్యార్థి నాయకులు స్థానిక తహసీల్దార్ ఆంజనేయ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేని నేపథ్యంలో ప్రైవేట్ కళాశాలలు పేద విద్యార్థులపై భారీ ఫీజులతో భారం మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేద కుటుంబాలకు విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ‘తల్లికి వందనం’ పథకం అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కాపురం మెడికల్ కళాశాలను పూర్తిగా ప్రభుత్వ నిర్వహణలో కొనసాగించాలని కూడా వినతిలో విజ్ఞప్తి చేశారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *