గ్రామీణ, తీర ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా చల్లాస్ హాస్పిటల్ ముందుకు సాగుతోందని డాక్టర్ చల్లా అమల్ రాజ్ తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల కేంద్రంలోని కందుకూరు రోడ్డు సెంటర్‌లో చల్లాస్ హాస్పిటల్ నూతన బ్రాంచ్‌ను బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ చల్లా అమల్ రాజ్ మాట్లాడుతూ, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో గత ఏడాది ఒంగోలులో చల్లాస్ హాస్పిటల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం సింగరాయకొండలో మరో బ్రాంచ్‌ను ఏర్పాటు చేసి తీర ప్రాంత ప్రజలకు ఆధునిక వైద్య సేవలను మరింత చేరువ చేసినట్లు పేర్కొన్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.రోగులకు ఆత్మవిశ్వాసం కల్పించాలి ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నూకసాని సుబ్బారావు మాట్లాడుతూ, రోగికి చికిత్స అందించడంతో పాటు మానసిక ధైర్యాన్ని కల్పించడం కూడా వైద్యుల బాధ్యత అని అన్నారు. రోగితో సానుకూలంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుని, అవసరమైన పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారించి సరైన చికిత్స అందించాలని సూచించారు. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను గ్రామీణ, తీర ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని డాక్టర్ చల్లా అమల్ రాజ్‌ను ప్రశంసించారు.డాక్టర్ బి.హరిబాబు మాట్లాడుతూ, తాను గత 40 సంవత్సరాలుగా పేదలకు వైద్య సేవలు అందిస్తున్నానని యువ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు ముందుకు రావడం సంతోషకరమని పేర్కొన్నారు.
నెలాఖరు వరకు ఉచిత ఓపీ సేవలు
హాస్పిటల్ డైరెక్టర్ చల్లా హృదయ రాజ్ మాట్లాడుతూ, ఈ నెల చివరి వరకు ఉచిత వైద్య ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అత్యాధునిక లేబరేటరీ సాయంతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని వైద్య సేవలు విస్తరించడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. తమ తాత చల్లా శేషయ్య, తండ్రి చల్లా సురేష్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ నూకసాని సుబ్బారావు, డాక్టర్ బి.హరిబాబు, డాక్టర్ బి. శివరామిరెడ్డి, డాక్టర్ అశోక్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొని ఆసుపత్రి ప్రారంభోత్సవం నిర్వహించారు. స్థానిక ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు విస్తరించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *