తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో నేరాల నియంత్రణ మరియు శాంతి–భద్రతల పరిరక్షణ లక్ష్యంగా జిల్లా పోలీసులు FINS సాంకేతికత ఆధారంగా రాత్రి పహరాను ముమ్మరం చేశారు.రాత్రి వేళ సమస్యాత్మక ప్రాంతాలను ముందుగా గుర్తించి, అక్కడ అనుమానితుల విచారణ, లాడ్జీలు–వాహనాల తనిఖీలు, గస్తీ నిర్వహణ వంటి కట్టుదిట్టమైన చర్యలను నిరంతరంగా అమలు చేస్తున్నారు.FINS సాంకేతికత ద్వారా అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలను తక్షణమే పరిశీలించి వారి క్రిమినల్ హిస్టరీని గుర్తించడం వల్ల నేరాలను ముందుగానే అరికట్టే అవకాశం ఏర్పడింది.ప్రజల భద్రతే ముఖ్య లక్ష్యంగా, జిల్లా పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ, నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈ పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *