తొలి శుభోదయం కందుకూరు:-
గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం హైదరాబాదులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపినందుకు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో చేపట్టిన 200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల గురించి లోకేష్ కి నాగేశ్వరరావు వివరించారు. కందుకూరుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నందుకు, అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూలేనంతగా పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుండడంపట్ల నారా లోకేష్ సంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను అభినందించారు.రాబోయే మూడేళ్లలో కందుకూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధంచేసి తనకు ఇవ్వాలని లోకేష్ ఎమ్మెల్యేకు సూచించారు. ప్రతి పనిని తప్పక పూర్తిచేసేలా, నిధుల లభ్యతను బట్టి ప్రాధాన్యత క్రమంలో పనులు మంజూరు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కుమారులు అవినాష్, సందీప్ చదువులు, వారి భవిష్యత్తు ప్రణాళికల గురించి లోకేష్ గారు ఎంతో ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. వారితో విలువైన విషయాలను పంచుకోవడమే కాకుండా, నిరంతరం ప్రజాసేవలో భాగస్వాములు కావాలని లోకేష్ గారు సూచించారు.
