తొలి శుభోదయం :-
తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయం లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం చేస్తున్న కృషిని హృదయపూర్వకంగా అభినందించారు.
సంఘాన్ని బలోపేతం చేసి భవిష్యత్తులో ఉపాధ్యాయులకు మరెన్నో ప్రయోజనాలు చేకూర్చేలా, విద్యా రంగ అభివృద్ధికి తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంగా,ఆంధ్రప్రదేశ్ ను విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ ముందుకు తీసుకెక్తున్నారని,వారి ఆశయాలకు అనుగుణంగా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో విద్యా రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం విశేష కృషి చేస్తున్నదని ఆయన తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి పూర్ణచంద్రరావు, అర్రిబోయిన రాంబాబు, బొట్లగుంట పూర్ణచంద్రరావు, ఆర్.ఎస్.ఎన్. మూర్తి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.