తొలి శుభోదయం సింగరాయకొండ:-
నూతన సంవత్సరం సందర్భంగా సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి డాక్టర్ వి లీలా శ్యాంసుందరి కుటుంబ సభ్యులు సామాజిక బాధ్యతను చాటుతూ పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని తాతయ్య గిరిజన కాలనీ చిన్నారులకు మరియు వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మానవత్వం, సేవాభావానికి ప్రతీకగా నిలిచింది.ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, శాంతి తీసుకురావాలని ఆకాంక్షించారు. సమాజంలోని బలహీన వర్గాల పట్ల శ్రద్ధ చూపడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని పేర్కొన్నారు.
పండ్లు, స్వీట్లు అందుకున్న చిన్నారులు, వృద్ధులు న్యాయమూర్తి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు , కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.